bommarillu



సినిమా నిర్మాణ పద్దతులు ,టెక్నిక్  సూత్రాల యాంత్రిక పరిజ్ఞానం  వున్నా వాడు డైరెక్టర్  మాత్రం కాదు ..వీటితో పాటు అసలు  సినిమా "హృదయాన్ని " చూడ గలిగిన వాడు ...
---సికిందర్
హృదయాన్ని  భాస్కర్  చూపించాడు ...ఆకట్టుకున్నాడు ....
                       ----------------ok ----coming to the point -------------

Premise :
“పెంచే తండ్రి కొడుకు తప్పటడుగులు వెయ్య కూడదని  జాగర్త పడతాడు ...తనంతట తానుగా ఎదగాలని  కొడుకు ప్రయత్నం చేస్తుంటాడు ...ఇద్దరిది తప్పు కాదు ...అయితే  20 ఏళ్ళు  వచ్చినా ఇంకా తండ్రి చేతిలోనే  కొడుకు వుండి పోతే ....”అని  టైటిల్ స్టార్ట్ చేసాడు ...ఇదే కధ
  కధ  కు పరిధి ..బౌండరీ  లైన్ఇల్లు ..ఇంటిలోని తండ్రి ...
కధ ఎక్కడెక్కడో తిరిగినా చివరకు ఇంటికే చేరుతుంది ...
కధ లో తండ్రి సాఫ్ట్ విలన్ ..అంటే అతి మంచి తండ్రి ...అతని తో సాధారణ కొడుకు చేసే పోరాటం ...ఇది మానసిక యుద్ధం ...ఫ్రెండ్స్ కి తప్ప ఎవరికీ చెప్పుకోలేనిది ...

Establishing the “main plot  line “point :
ముందుగానే పాయింట్ చెప్పారు ..కాబట్టి ప్రేక్షకుడి మైండ్  ఫిక్స్ అవుతుంది ..కధ లో ఏమి జరిగినా కోణం లోనే చూస్తాము ..అందుకనే సిద్ధార్థ  చేత  కొన్ని సీన్ లు చూపించారు ..అవి సిద్ధార్థ  బాధని  Establish చేస్తాయి (..అవి కాని తీసి వేసి చుడండి ..సిధార్థ  చేసేది రాంగ్  అంటాము )
 

-------------cut -----------Screen play starts ----------

.

Introduce all characters related to main character


హీరో క్యారెక్టర్ ..మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ...అతనికి సంబంధించిన  వాళ్ళని  పరిచయం చేస్తారు .
మొదట  ఇంట్లోంచి మొదలు పెట్టి ...ఫ్రెండ్స్  ని కూడా పరిచయం చేస్తారు ...
Dramatic need : (may be internal or external )
If you know  your character’s  dramatic need ,you can create obstacles to it  and then  your story becomes  your character ,overcoming obstacle after obstacle to achieve his/her dramatic need..
సిద్ధార్థ  కు కెరీర్ ,పెళ్లి విషయం  లో మాత్రం --నాన్న మాట కాకుండా , తన ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటాడు ..అది ఫ్రెండ్స్  కి చెప్పాడు ...( ప్రేక్షకుడి కి చెప్పాడు )
Obstacles Created :
తండ్రి (ప్రకాష్ రాజ్) కి నచ్చిన తనికెళ్ళ భరణి కూతురు (నేహ ) తో ఎంగాజిమేంట్ అవుతుంది ..అంటే సిద్ధార్థ కి ఇష్టం లేనిది జరిగింది ...తండ్రి కి ఎదురు చెప్పలేడు...అందుకే ఫ్రెండ్స్ వద్ద త్రాగి  బాధ పడ్డాడు ..( ఇక్కడే సిద్దార్థ  మీద సానుభూతి వస్తుంది ...ఇక క్యారెక్టర్ ఎంత హద్దు మీరినా క్షమిస్తాం ...)

Hero Break the rules of normal life of audience :
నిచ్చితార్దం అయిపోయిన వాడు సిద్ధార్థ ...మనం అయితే ఏమి చేయలేము ..కాని హీరో కాబట్టి తన  ఆలోచనల ప్రకారం  ఇష్టం లేని  పెళ్లి చేసుకోకూడదు ...అందుకే ప్రేమిస్తాను ..పిల్లను వెతుకుదాం ..అని అంటాడు ..ఫ్రెండ్స్ తో .....
------------------సాంగ్ – పదహారణాల---------------------

Plot point 1 :
it is the true beginning  of the story ..any incident that hooks into action and spins it around  in another direction ..
అమ్మాయిల ను వెతికి వెతికి  అలసి పోయిన సిద్ధార్థ కి హాసిని (జనీలియా ) గుడి దగ్గర దొరికింది ... ...చిన్నపిల్లలా సరదాగా  సిద్ధార్థ ని ఆకర్షించింది ...

Sub plot : ప్రేమకధ ..
హీరో ..హీరోయిన్ మధ్య జరిగే  ప్రేమకధ ఎంత బాగుంటే ..సినిమా అంత బాగుంటుంది ..
ఇంతవరకు సినిమాలో రానిది ..కొత్తది వుండాలి ఇది జనాలకి పట్టిందా ...సినిమా హిట్
If Hero is moody …Heroine must be hilarious …
సిద్దార్థ ధనవంతుడు ..చిన్న చిన్న ఆనందాలను మిస్ అవుతున్నాడు ...హాసిని మధ్య తరగతి అమ్మాయి ..చిన్న చిన్న ఆనందాలే లోకం  గా వుంటుంది ...ఈContrast nature maintain   చెయ్యడమే  సినిమా కి success వచ్చింది ...
హాసిని అనుభవించే అన్ని ఆనందాలు సిద్ధార్థ  అనుభవిస్తూ అనందం గా వుంటాడు ...


1.డబుల్ డేకెర్ బస్సు లో ప్రయాణం ...పరిచయాలు ..
2.మినర్వా షాప్ లో టీ త్రాగడం
3.రోడ్డు పక్కన  పానిపూరి తినడం          
-----ముందు సిద్ధార్థ  ప్రేమలో పడి సాంగ్  పాడుకుంటాడు  కాని ఇప్పుడు ...”----
4.కోటి సుల్తాన్ బజార్ లో కేలడిస్కోపు  కొనుక్కోవడం
5.సిగ్నల్ పెట్టుకొని ఫోన్ చేసుకోవడం
6. రాత్రి పూట ఐస్ క్రీం తినడం
హాసిని కూడా సిద్ధార్థ ని ఇష్ట పడింది ..ఇద్దరు కలసి పోయారు ...
-----అదే  " అప్పుడో ఇప్పుడో "Montage  సాంగ్  లో చాలా షాట్స్  రూపం  లో చూపించారు
ఇక్కడే సిద్ధార్థ దాచిన విషయం  బయట పడుతుంది ...తనకు నిశ్చితార్దం  అయిన విషయం ...హాసిని డల్ అయ్యింది ..సిద్ధార్థ  బాగా డల్ అయ్యాడు ...

దీన్ని
హాసిని బ్రేక్ చేసింది ..."నీకిష్టం లేకపోతే మానేయ్ " అని  చెప్పి ..I love you చెబుతుంది ...
అప్పుడే కోట శ్రీనివాసరావు (హాసిని తండ్రి ) వస్తాడు ..కాని కోట కి విషయం తెలియడం వలన  ఉపయోగం లేదు ..అసలు సిద్ధార్థ  యుద్ధం  తండ్రి ( ప్రకాష్ రాజ్ ) తో ...
అందుకే " I love you హాసిని “ అంటుంటే  ప్రకాష్ రాజ్ కార్ దిగి  చూడటం  ...
-------------------------------ఇంటర్వల్ బ్రేక్ ----------------------------------------------------

0 comments:

Post a Comment