ScriptRule0



                                      Script rule 0

సినిమా కధ రాయాలంటే  ముందుగా కొన్ని సరి చేసుకోవాలి ...అవి
1.ఏ టైపు సినిమా తీయాలి ? (Genre )
2. సృజనాత్మకత ( Creativity )
3. ఓపిక   (Patience )
4. ఆత్మ విమర్శ   (self realization )
5. బడ్జెట్ ..(Budjet )

1.ఏ టైపు సినిమా తీయాలి ? (Genre )
 ఫ్యామిలీ  ఎంటర్ టయినర్ ,హార్రర్ ,థ్రిల్లర్ ,ట్రావెల్ ...ఇలా చాలా రకాలు గా  సినిమాలను ఎప్పుడో విడదీసారు ..వాటిల్లో  ఏరకం  సినిమా తీయాలో కచ్చితం గా నిర్ణయించుకోవాలి ..ఇక్కడ ఫుల్  క్లారిటీ  వుండాలి ..లేకపోతే  వదిలేయాలి ...

2. సృజనాత్మకత ( Creativity )
కధ కొత్తదా ? కాదా ? ... ప్రేక్షకుడ్ని  నవ్విస్తుందా?...ఆలోచింప చేస్తుందా ..? విసిగిస్తుందా..? త్రిల్ కి గురి చేస్తుందా ? ...ఇలా అన్ని రకాలు గా  కధ దగ్గర ఆలోచించాలి ...
ఇక్కడ  కధ సరిగ్గారాకపోతే వదిలేయడం బెటర్ ..time and money save …
( Every year 120 సినిమా లో  100 flops ..మీకు తెలుసుకదా Creativity లేకపోవడమే  దీనికి కారణం  )
3. ఓపిక   (Patience )
స్క్రిప్ట్ రాయడం లో ఓపిక వుండాలి ...కధ మంచిది అయితే  సీన్ లు ఎంతో బాగా రాసుకోవాలి ..కొన్ని సార్లు సీన్ లు రావు ..కధ ముందుకు వెళ్ళదు ..అప్పుడే ఓపిక కావాలి ...
ఇలాగె 3 idiots ,Lagaan ,Shiva ,Arundhati వచ్చాయి ...
(ఓపిక లేకే  చాలా సినిమాలు --మంచి పాయింట్ వున్నా సరి అయిన సీన్ లు లేక  చతికిల పడుతున్నాయి ..)
4. ఆత్మ విమర్శ   (self realization )
“మనం చేసింది  బాగుంది” అని మనం అనుకుంటే కుదరదు ...రాసింది ప్రతీది పేలదు ...అన్ని విధాలా కొందరితో అయినా చర్చించాలి ..ఇంకా ఏమి Attractions  పెట్టాలో ఆలోచించాలి ..(చాలామంది డైరెక్టర్  లు ఫెయిల్ అవుతుంది  ఇక్కడే..)

5. బడ్జెట్ ..(Budjet )
క్లారిటీ  వున్నా డైరెక్టర్ ,నిర్మాత  లు  ఏది  అనవసరం  -- ఏది అవసరం  ..అని అలోచించి  నిర్ణయించుకోవాలి ...ఇది  వీళ్ళిద్దరే  కంట్రోల్  చేయగలరు ..హీరో లు కాదు ...


5 comments:

Post a Comment