nuvvu vastanante nenu vaddantana



నువ్వొస్తానంటే  నేనోద్దంటానా :
అవునండీ ,...ఇది  మైనే ప్యార్ కియాథీం తో  "ప్యార్ కియా తో డర్నక్యా హై " సినిమా బేస్ చేసుకుని రాసినదే ..అయితే ఏంటి ?....
కొత్తగా వున్నదా ..లేదా ?  ప్రేక్షకులకు పట్టిందా ...లేదా ?  అదే కావాల్సింది ...అంతే గానీ  విమర్శకుల  గురించి ఆలోచిస్తే  సినిమాలు  ఎవరు తీయలేరు ...
ఇదంతా కాదు "సినిమా అన్నది వ్యాపారం " ఇదే అన్నింటికీ సమాధానం ....
ఇక పాయింట్ కి వద్దాం..


Cinema Story :


లండన్ లో పెరిగిన అబ్బాయి ..సిధార్థ ..అన్న దగ్గర పెరిగిన అమ్మాయి త్రిష ...వీళ్ళిద్దరూ  ప్రేమ లో పడటం ..పెద్దలు  వేరు చేయడం ...సిధార్థ  ..తన ప్రేమను దక్కించుకోవడానికి  శ్రీహరి ( త్రిష అన్న ) తో  పందెం  కాయడం ..."ఒక బస్తా ధాన్యం  ఎక్కువగా పండిస్తానని "... ప్రయత్నం  లో కష్టాలు ...మలుపులు ..చివరకు  ప్రేమికులిద్దరూ కలిసారా ? లేదా ? అన్నదే కధ...

Main points :
1.స్క్రీన్ ప్లే  ప్రకారం  శ్రీహరి ని జైలు  లో చూపిస్తారు ...ప్రేక్షకుడికి కి ఆలోచనలు మొదలువుతాయి ..ఎవరిని చంపి  శ్రీహరి జైలు కి వచ్చాడు ? అని ... curiosity  లో  ప్లే  అవుతుంది ..ఇది మనం  గమనించం ...
2.Altering emotions : cry----laugh----feel ----sentiment
సినిమా ఫస్ట్ హాఫ్ లో చూస్తున్నప్పుడు  గానీ   సెకండ్ హాఫ్ లో గానీ  ఎక్కువ బాగం  కామెడీ కి  ప్రాదాన్యత  ఇచ్చినా  మద్య మద్య లో ఫీల్ కి .. సెంటిమెంట్ కి  వేల్యూ  ఇచ్చి కధ ని నడిపారు ..కాబట్టి అన్ని విధాల  family Entertainer    అనిపించుకుంది ....
3. Must maintain the variation between the first half and second half ..
రూల్  మన తెలుగు సినిమాలకు బాగా వర్తిస్తుంది ..
ఫస్ట్ హాఫ్ అంతా సిటీ లో పెళ్లి ..ఫంక్షన్  లలో హ్యాపీ గా సాగితే ...
సెకండ్ హాఫ్ అంతా  పల్లెటూరి లో  ప్రశాంతం గా సాగుతుంది ...
4.if a character’s challenge was easy there would be no story …..



క్యారెక్టర్ కి చిన్న  చాలెంజ్  వుంటే  ..అది కూడా  తక్కువ టైం లో కంప్లీట్  అయితే ..స్టొరీ రాయాల్సిన  అవసరం లేదు ..
ఎక్కడో లండన్ లో సుకుమారం గా పెరిగిన సిధార్థ  ..మొండిగా ..బండగా ..వుండే పొలం లో కి దిగి రైతు  లా మారి ...పొలం దున్నాలి ...పంట పండించాలి ...ప్రేమ గెలవాలి ...ఎస్  పెద్ద చాలెంజ్ .. అది విజువల్  గా   బాగా చూపించొచ్చు ...

5. After interval  :  a problem turn in to another problem
ప్రేమికులు ఆల్రెడీ కలసి పోయారు ..అంటే  కధ లో ఒక ప్రొబ్లెం తీరిపోయంది ..మిగిలిన ప్రొబ్లెం అంతా  పెద్దల మధ్య వుంది ...ముఖ్యం  గా శ్రీహరి  దగ్గర వుంది ...అందుకనే శ్రీ హరి  సిధార్థ  కి  "పొలం లో ధాన్యం  పండించాలని " చాలెంజ్  విసురుతాడు ...సిధార్థ  "ఒక బస్తా ఎక్కువే పండిస్తా నంటాడు ".. ఒక సమస్య  ఇంకొక సమస్యలోకి వెళ్ళింది ..కధ కి tempo ,interest   వస్తుంది ...

6.The whole enjoyment of watching any type of movie is watching a sympathetic lead character getting themselves in to big trouble.

                                                 
సెకండ్ హాఫ్ లో  సిధార్థ  శ్రీహరి దగ్గరికి  వచ్చాక ..నర్సింగ్  యాదవ్  పెట్టే  ఇబ్బందులు ..ప్రేక్షకుడు కి  సిధార్థ  మీద  సానుభూతి కల్గిస్తాయి ..మెల్లగా  సిధార్థ  పుంజుకొని  నర్సింగ్ యాదవ్  ని ఆట  పట్టించడం తో  మనం  చాలా ఆనందిస్తాం ...
7.Big ups and downs is to give the movie depth and make the audience feel they have been  on a long and worthwhile emotional journey .
ఒక అందమైన ప్రేమ కధ ..హద్దులు మీరని ప్రేమ కధ ...ప్రేమికులిద్దరినీ  విడదీసారు  పెద్దలు ...హీరో సిధార్థ  తన ప్రేమ ను గెలిపించుకోవడానికి  చాలెంజ్  స్వీకరించి ..కష్టపడతాడు ...పంట  పండించాడు అనుకునే లోపు ...విలన్ లు వచ్చారు ...పంటను నాశనం  చేయాలనుకున్నారు ......మళ్ళీ  ఇంకొకసారి  విలన్ లు పంట ను నాశనం చేయాలనీ చూస్తారు ...కుదరలేదు ... సారి త్రిష కి పెళ్లి చేయాలనీ  చూస్తారు ...చివరకు  సిధార్థ  నర్రా కొడుకు ని చంపడం తో ...కధ  ముగుస్తుంది ...
ఇలా కధ పడుతూ ...లేస్తూ ...మలుపులు తిరుగుతూ  వుంటే ...ప్రేక్షకుడు  తన  మనసులో అద్బుత ప్రయాణం  చేస్తాడు ..
8.Main character  graph must be increased along  the movement of the story .
సిద్ధార్థ  ప్రేమించడం వరకు బాగానే  వుంటుంది ...కానీ  సెకండ్ హాఫ్  లో పొలం దున్నగలడా ? పంట పండించా గలడా ? ప్రేమ నిలుపుకోగాలడా ? శ్రీ హరి ని ఒప్పించగలడా ? అన్న సందేహాలన్నీ  వరసగా  నిరుపించుకుంటూ  ముందుకు వెల్లిపోతుంటాడు...సుకుమారం గా వున్న సిద్ధార్థ  సినిమా వెళ్తున్న కొద్దీ ...గొప్ప ప్రేమికుడి గా ... గా  మారిపోయి ప్రేక్షకుడి మనసును  జయిస్తాడు ...కాబట్టే  అది మంచి క్యారెక్టర్    ...అలాగే  శ్రీ హరి supporting  character కూడా ....ఇదే సినిమా కి వెన్నుముక ...


Asset -1 :
నో డౌట్ ...సీతారామ శాస్త్రి గారి పాటలు ...అన్ని  పాటలు రాయడం ...అన్ని రకాల పాటలు రాయడం ...ఆయనకే  చెల్లింది ...
1.చంద్రుల్లో వుండే కుందేలు ...

2.
నిలువద్దం నిన్నేపుడయినా...


3.
ఘల్ ఘల్ ... అని ప్రేమకు పంట కు ముడి పెట్టి పాట రాయడం మాటలు కాదు ...

4.
సంథింగ్ ...

5.
అదిరే  ..

6.
పారిపోకే పిట్ట కూడా అలరిస్తాయి ..మంచి ట్యూన్ లి ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్ ..
ఒక్క "ఘల్  ఘల్ " సాంగ్ తో  పంట  పండిచేయడం చూపించి ..స్క్రీన్ టైం చాలా కలసి వచ్చేలా చేసుకున్నారు ...

Asset -2 :

Camera:
చిన్న చిన్న విషయాలను ..పకృతి  ని చాలా బాగా చూపించారు ... అది ప్రభుదేవా  గుండె లోంచి  వచ్చినట్టుగా  వుంది ..అందుకే   M.S.Raju మరో సారి  సంక్రాంతి   రారాజు అయ్యారు ...

Asset-3 :

Plot device :  గుర్రం బొమ్మ
అసలు కధ  ప్రారంభం లో ఇది  లేదట ...
సెకండ్ హాఫ్ లో శ్రీ హరి కి  " సిద్ధార్థ  ప్రేమ నిజం " అని తెలియాలని ..అలా తెలిసే ఒక ఇన్సిడెంట్ జరగాలని  అనుకున్నారట  పరుచూరి బ్రదర్స్ ...
అప్పుడు  ఒక బొమ్మ పెడదాం  అనుకున్నారు ...అదే గుర్రం బొమ్మ ..
రీజన్  వుండాలి కాబట్టి చిన్నప్పుడి  నుండి కధ అల్లారు ...
పెంచిన గుర్రం చనిపోతే  శ్రీ హరి  చెల్లెలకు గుర్రం బొమ్మ చేసి ఇస్తాడు ..అది త్రిష కు ప్రాణం ...అది పగిలితే  సిద్ధార్థ అతికించి   డెకరేట్ చేసి ఇస్తాడు ...దాని తో  త్రిష లవ్ లో పడుతుంది ..
సెకండ్ హాఫ్ లో    గేదెల కొట్టాన్ని మంటలు ముంచెత్తితే ..అప్పుడు సిద్ధార్థ  ప్రాణాలు లెక్క చేయకుండా  పెట్టే తెస్తాడు ..అందులో గుర్రం బొమ్మ  వుంటుంది ...అంతే శ్రీ హరి కరిగి పోతాడు ...గుడి దగ్గర  మాట కూడా అంటాడు ...చూడండి...ఇంతలా  ని వాడిన ఘనత  పరుచూరి వాళ్ళకే  చెల్లింది ...


0 comments:

Post a Comment