Ghajini



అమీర్ ఖాన్  :
ఫార్ములా కధ మధ్య కొత్తదనం  వున్నా కధలు  ఎంచుకొని ..పకడ్బందీ స్క్రిప్ట్  తో   సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ..ఇతనేమి ఇమేజ్ కి భిన్నం గా  చేయడం లేదు ..పాత సినిమా ఇమేజ్ ని పక్కన బెట్టి కొత్త ఇమేజ్ ని సృష్టించు కుంటున్నాడు ..
అతను చేసిన సినిమా లలో పాత్రలు ఒక ప్రత్యేక రకమైన వ్యక్తిత్వం  కలిగి వుంటాయి ...
1.ముందు గోల్ లేకపోయినా సినిమా చివరికి వచ్చేసరికి గోల్ ఏర్పరుచుకుంటాడు .. ఇది యూత్ వారికీ నచ్చుతుంది ...
Example : "దిల్ చాహతా హై"..."రంగ్దే బసంతి "...
2. ముందునుండి సీరియస్ గోల్ వుంటుంది ..ఇది అందరికి నచ్చుతుంది ..
Example : సర్ఫరోష్ ...లగాన్
3. మనలో ఒక్కడిగా వుంటూ మార్గదర్శకత్వం చూపిస్తాడు..  యూనివర్సల్ క్యారెక్టర్ ..
Example : 3ఇడియట్స్ …….. తారే జమీన్ పర్
4.ఇక మిగిలింది  స్వచ్చమైన  ప్రేమికుడు
Example : గజినీ

------ok ---------------coming to the points ----------

New Concept  + good cute love story +  Revenge format  = Ghajini 

New concept : 
 

 హాలీవుడ్  సినిమా"మొమెంటో" నుండి కొత్త కాన్సెప్ట్ ఎత్తారు ...కానీ ఆ కాన్సెప్ట్ లో కి  భారతీత ను  ప్రవేశపెట్టాడు ...మన ప్రేక్షకుడికి అనుకూలం గా  మార్చాడు ...స్క్రీన్ ప్లే అర్ధవంతం గా రాసుకున్నారు ..సీన్ లు ఇందులోంచి ఎత్తినా బాగా తీసారు ..ఇది ప్లస్  పాయింట్ ..





Good cute love story :

ఎటువంటి కధలో అయినా ప్రేమ కధ ఇరికిన్చేయడం మన పద్ధతి ...ఆ లవ్ స్టొరీ ఎంత బాగుంటే ..సినిమా అంత హిట్ అవుతుంది ...అసిన్ -అమీర్ ఖాన్ ల మధ్య నడిచే ప్రేమ కధ చాలా బాగుంటుంది ...ఇది సినిమా కి కలిసి  వచ్చిన పాయింట్ ..మళ్ళీ మళ్ళీ సినిమా చూసేలా చేస్తుంది ..

Revenge format  :

హీరో కి " షార్ట్ టర్మ్ మెమరీ లాస్ " వుంది ..ఈ వీక్ నెస్ తో  ప్రేయసి ని చంపిన  విలన్ ని ఎలా  అంతం చేస్తాడు ? అనే  వుంటుంది అందరి మైండ్ లో ...అదే పెద్ద ప్లస్  పాయింట్ ...
ఈ మూడు పాయింట్ లు సినిమా కి కొత్తదనం తీసుకు వచ్చాయి ...
ఒక్క సినిమాలో 3  కొత్త పాయింట్ లున్నాయి ...
ఇంకా అమీర్ ఖాన్ గెటప్ ..కండలు 6 ప్యాక్ బాడీ ....ఇవి చాలు ప్రేక్షకుడు  హాల్ వరకు వెళ్ళడానికి ....


Screenplay : 

సినిమా కధ ను సూటిగా ..సుత్తి లేకుండా ...కొత్తగా ..అర్ధవంతం గా .curiosity తో.. నడుపుతున్నా మన్నదే  స్క్రీన్ ప్లే ..
Straight Narration లో  ట్విస్ట్  లు వస్తే నే  ఇంట్రెస్ట్ పుడుతుంది ...
Screenplay Narration  లో   మొదటి నుండి ఇంట్రెస్ట్   కల్గించవచ్చు ..
ఎక్కడ కధ ఆపినా ప్రేక్షకుడు  ఏమైంది ? ఏమియ్యుంటుంది  ? అని Curiosity  తో చూస్తూనే  వుంటాడు ..అందుకే సినిమా కి స్క్రీన్ ప్లే  ముఖ్యం అంటారు ...

------------------------------------------------------------------------------ 
Discussing “Interesting point “:



ప్రధాన పాత్ర అమీర్ ఖాన్  ని ఇంకొక పాత్ర  మెడికల్ స్టూడెంట్  సునీత (జియా ఖాన్ ) తో ఓపెన్ చేస్తారు ...ఇంటరెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేస్తారు ...ప్రేక్షకుడి కి వచ్చే డౌట్స్  అన్నీ చెప్పారు ...అలాంటివాడు ఇప్పుడేమి చేస్తున్నాడో ....cut






Curiosity play : 

రోగం వున్నవాడు  హాస్పిటల్ లో వుండాలి ..లేదా ఇంట్లో వుండాలి ...కానీ అమీర్ ఖాన్ ఏకం గా ఒకడ్ని కొడుతున్నాడు ...చంపాడు ...వాడ్ని ఫోటో తీసి టిక్  పెట్టుకున్నాడు ..ఎందుకు వీడ్ని చంపాడు ...అంటే వీడి వెనక ఏదో కధ వుంది ..అనే Curiosity create చేసాడు ...cut 

             -------------All ready two characters introduced ------------

Introduce Remaining Characters : 

హత్య జరిగింది ..పోలీసు లు వచ్చారు ..కధ కి అవసరం అయిన ఇన్స్పెక్టర్ వచ్చాడు ...చనిపోయిన వాడు విలన్ మనిషి ..విలన్ కుడా వచ్చాడు ... ఇన్స్పెక్టర్ కి చిన్న ఆధారం దొరికింది…cut 

Main character’s life Introduction :

అమీర్ ఖాన్  పరిస్థితి ,జీవితాన్ని  ఒక ఆటో సీన్  తోను ..ఇంట్లో కి వెళ్ళాక  అతని ఆలోచనలను ... పగ తీర్చుకోవడానికి ప్లాన్స్  అన్నీ చూపిస్తారు ... Remove Tshirt తర్వాత  బాడీ మీద పచ్చ బొట్లు  చూపించి ...ఆ చంపినా వాడ్ని గుర్తుకు తెచ్చుకోవాలని  ప్రయత్నం ..గుర్తుకు రాకపోవడం  ..బాధ పడటం ... చూపించే సరికి  ప్రేక్షకుడి కి సానుభూతి వస్తుంది ...రోగం వున్నవాడు కధ ఇంకా ఎక్కువ సానుభూతి వస్తుంది ...ఇది చాలు ఈ పాత్ర తో మనం కలసిపోయి ప్రయాణించడానికి ...


Police Investigation 1 :

ఇన్స్పెక్టర్ కి చిన్న ఆధారం దొరికింది ..సిటీ బస్సు టికెట్ ...దానిInvestigation తో  స్టార్ట్ చేసాడు ... అమీర్ ఖాన్ ని పట్టుకోవాలని బస్సు ఎక్కాడు ...కానీ మిస్ అయ్యాడు ...

Establishing Relation Between main character and supporting character :

హీరో కాస్త బలహీనుడు అయితే  సహాయపడే  క్యారెక్టర్ లు కధ కి అవసరం .దాని వలన హీరో కి  మంచి జరుగుతుంది ...ఆ సహాయపడే  క్యారెక్టర్ మెడికల్ స్టూడెంట్ సునీత (జియా ఖాన్ )...అనుకోకుండా జియాఖాన్ -అమీర్ ఖాన్ ని కలుస్తుంది ..ఫోటో దిగుతుంది ...ఫ్రెండ్ అని అమీర్ ఖాన్ రాసుకుంటాడు ...కధ కి అవసరం ...లేకపోతే వీల్లిద్దరిని  కలపక పోతే  కధ లో పటుత్వం పోతుంది (...జియాఖాన్ మొదట అపార్ధం చేసుకొని అమీర్ ఖాన్ కి చెడు చేస్తుంది ...తర్వాత హెల్ప్ అవుతుంది ...)….cut …

Police Investigation 1 : అమీర్ ఖాన్ ఇంటిలోకి వచ్చాడు ఇన్స్పెక్టర్ ...అమీర్ ఖాన్ ని కొట్టాడు ...కట్టేసాడు ...ఇతను ఎవరు ? అని ఆరా తీస్తున్నాడు ...డైరీ  దొరికింది ...

                          -----------------Flash back 1 open ----------------

Drive -1:
 అమీర్ ఖాన్  సంజయ్ సింఘానియా ...పెద్ద సెల్ ఫోన్ కంపెనీ అధినేత ..పారిశ్రామిక వేత్త ...వృత్తి పరం గా  కల్పన అసిన్  ఇంటి  మీద సెల్ టవర్ పెట్టలనుకుంటాడు ...అసిన్Ad   కంపెనీ లో చోటా మోడల్ సైడ్  యాక్టర్ ...
సెల్ టవర్ విషయం మాట్లాడ డానికి వచ్చిన వాళ్ళ మాటలు విని ...Ad డైరెక్టర్  పొరపాటు బడి  లవ్ మేటర్ లా Create  చేస్తే ..దాన్ని  అసిన్Advantage గా తీసుకుని ఎదుగుతుంది ...
 అనుకోకుండా  ఒక జర్నలిస్ట్  వస్తే ,అబద్దాలు చెపితే వాడు ఇంకా కల్పించి సీరియల్  వేస్తాడు ..
Sensitive scene 1 :
 పుకార్లను విన్న అమీర్ ఖాన్ అసిన్ కి వార్నింగ్  ఇవ్వలనుకుని వస్తుంటే ...దారిలో  అసిన్ వికలాంగులకు హెల్ప్ చేయడం  చూసి ..కాస్త ఇష్ట పడతాడు ...
తీరా అసిన్ దగ్గరికి వెళ్ళే సరికి  తన కి నోట్లోమాట రాదు ...సచిన్ గా పరిచయం అవుతాడు ...


Drive -2 :
అసిన్ కి అమీర్ ఖాన్ వేరొక పేరు (సచిన్ ) తో పరిచయం ...ఆమె తో జర్నీ ....






Sensitive scene 2 :

 


అసిన్  గుడ్డి వానికి రోడ్డు మీద జరిగేవి చెప్పడం ...








అమీర్ ఖాన్ కి మెల్ల గా ఇష్టం కాస్త  ప్రేమ గా మారడం .
ఏ డ్రామా కైనా  బ్రేక్ రావాలి కదా ...అదే అసిన్ కల్పించిన ప్రేమ కధ కు బ్రేక్ వస్తుంది .. డైరెక్టర్  సంజయ్ సింఘానియా ని న్యూ ఇయర్ పార్టీ కి పిలుస్తున్నాం అని  కార్డు  వేయడం ..
అసిన్ చిక్కుల్లో పడుతుంది..
ప్రేక్షకుడి కి తెలిసిన అమీర్ ఖాన్ సచిన్ ..సంజయ్ సింఘానియా లాగ వస్తాడు ...
పార్టీ అయ్యాక  సిటీ బస్సు లో "ఐ లవ్ యు " అంటాడు..అసిన్ రేపు చెబుతా నంటుంది ...
డైరీ అయిపొయింది ...  
( ప్రేక్షకుడికి  కి తెల్సిన డ్రామా బాగా పండుతుంది ..అసలు అమీర్ ఖాన్  సంజయ్ సింఘానియా అని ప్రేక్షకుడి కి తెలుసు ..అసిన్ కి తెలియదు ...ఈ డ్రామా ఎప్పుడు బ్రేక్ అవుతుందో అని ఎదురు చూస్తుంటాడు ... ..రాఘవేంద్ర రావు  గారు ప్లే చేసేది ఇదే)

                          ------------------Flash back 1 end -------------------

 
అమీర్ ఖాన్ కి మెలుకువ వచ్చింది ...ఇన్స్పెక్టర్ ని తన్నాడు ...చంప బోయాడు ...అతని కంపెనీ వాళ్ళు వచ్చారు .. వాళ్ళతో మాట్లాడాడు అమీర్ ఖాన్...cut
తర్వాత  మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఫంక్షన్ వుంది ..దానికి విలన్ వస్తున్నాడని అమీర్ ఖాన్ వెళ్ళడం ...

అనుకోకుండా  వేరొక రౌడి ని చంపడం ...వాడు విలన్ కి సగం చెప్పి చావడం ...cut
మెడికల్ కాలేజీ స్టూడెంట్  జియాఖాన్..

అమీర్ ఖాన్  ఇంటికి వచ్చింది .అమీర్ ఖాన్ గురించి అపార్ధం చేసుకుంది ..ఇన్స్పెక్టర్ ని చూసింది ..
కట్లు విప్పి పారి పోదాం అనుకుంటే  అమీర్ ఖాన్  వెంట పడ్డాడు ...ఇన్స్పెక్టర్ చనిపోయాడు ...
(క్యారెక్టర్ కధ లో చనిపోలేదంటే  ఈ కధ క్రిమినల్ కధ లా మారిపోతుంది ..చనిపోవాలం తే)...మంచి ప్లే తో జియా ఖాన్ కుడా అమీర్ ఖాన్ నుండి తప్పించుకుంటుంది ..cut
ఎవరు చంపుతున్నారో తెలియక అందరినీ చంపుతూ ,ఇబ్బంది పడుతున్న విలన్  కి వెళ్లి జియా ఖాన్ మొత్తం అమీర్ ఖాన్ గురించి చెబుతుంది ...
విలన్ కి టార్గెట్ తెల్సింది ..ప్రేక్షకుడు  బయపడతాడు..ఆలోచిస్తాడు ..
      -----------------------------Interval ------------------------



0 comments:

Post a Comment