Ashta Camma



సినిమా అంటే  Just Entertainer  ..సందేశం  వుంటే ఉండొచ్చు ...లేకపోతే  లేదు ...
అన్ని విధాల క్లారిటీ  వున్నా ఇంద్రగంటి మోహన కృష్ణ  పర్ఫెక్ట్ స్క్రిప్ట్  తో  వచ్చి ,  బాక్స్ ఆఫీసు లోంచి ఎవరికీ తెలియకుండా  పెట్టిన సొమ్ము కి మూడింతలు  కలెక్షన్ లు  తీసుకెళ్ళిపోయాడు ...అది మంచి డైరెక్టర్ పనితనం ..

Main story synopsis :
సినిమా హీరో “మహేష్ బాబు” మీద  పిచ్చి అభిమానం  వున్న ఒక అమ్మాయి కలర్స్ స్వాతి ... ఉరఫ్ లావణ్య ..


మహేష్ అనే పేరు పెట్టుకుని  సిటీ లైఫ్ గడిపే వాడు నాని ... ఉరఫ్ రాంబాబు ...
వీళ్ళిద్దరిది  ఒక ప్రేమకధ ..


అవసరాల శ్రీనివాస్ (ఆనంద్ ) కి నాని చెల్లి వరలక్ష్మి కి జరిగేది  మరొక ప్రేమ కధ ...
రెండు ప్రేమ కధ లు ఒకటవ్వటం మొత్తానికి సినిమా కధ ...

Main crucial script point  :

ప్రేక్షకుడే సినిమా కి పెన్నిధి ..ప్రేక్షకుడి కి ప్రతీ క్యారెక్టర్  వీక్ నెస్/ఇబ్బందులు  ముందే తెల్సి పోవాలి ...కానీ కధ లోని పాత్రలకు తెలియ కూడదు ... డ్రామా పాయింట్  తో నే  సినిమా  మొత్తం రన్ చేయడం బాగుంటుంది ...

( వి వి చాలా సినిమాల్లో ఇదే డ్రామా పాయింట్ ప్లే చేసారు ..)

ముఖ్యం గా  లావణ్య కు సంబంధించిన "మహేష్ బాబు పిచ్చి " --నాని కి తెలియదు ..

నాని  పేరు "రాంబాబు " అని  లావణ్య కి తెలియదు ...కానీ రెండు విషయాలు ప్రేక్షకుడి కి తెలుసు ..

అలాగే ...ఆనంద్ ....పేరు "మహేష్ " కాదు ...ఇది వరలక్షి కి తెలియదు ..

విషయం కుడా ప్రేక్షకుడి కి తెలుసు ....అందువల్ల  ఆయా క్యారెక్టర్ లు ఇబ్బంది పడుతుంటే  ప్రేక్షకుడు ఆనందిస్తాడు ...కధ చివరికి వస్తున్నా కొద్దీ ఒక కధ కి ముగింపు ఇస్తూ సినిమా ని ఎండ్ చేస్తాడు  ఇంద్రగంటి ...

సినిమా కధ మొత్తాన్ని రన్ చేసేది ..ట్విస్ట్ లు రప్పించింది  ఆనంద్ క్యారెక్టర్ ...అవసరాల శ్రీనివాసే ..

Good Scenes :

1.లావణ్య క్యారెక్టర్  ని Establish  చేసే  సీన్
 
2.లావణ్య -ఆనంద్ ఫ్లాష్ బ్యాక్ సీన్
 
3.నాని -ఆనంద్ మధ్య స్నేహం పెరిగింది అని చెప్పే  సీన్
 
4.నాని ఫ్లాష్ బ్యాక్ ( పెదరాయుడు ,శివరామరాజు  పేరడీ )సీన్

 
5.తనికెళ్ళ భరణి -అమ్మాజీ  మధ్య నడిచే లవ్ ట్రాక్ సీన్ లు
 
6.లావణ్య -వరలక్ష్మి లిద్దరూ గొడవ పడే సీన్

 
అన్నీ సరదాగా వుంటాయి ..

Asset -1:







 మెయిన్ క్యారెక్టర్ లు  ఏమి చెయ్యాలి ? ఎలా మాట్లాడాలి ? పరిస్తితి ని వివరించలేక ఎలా బాధ పడితే  ఫన్ వస్తుంది ? ఇలా అన్ని విధాలా స్క్రిప్ట్ లో క్లారిటీ రాసుకున్నాడు కాబట్టే  సినిమా అంత బాగా వచ్చింది ... క్రెడిట్  అంతా దర్శకుడి దే ...






 Asset -2:


మాటలు సినిమా ని మొత్తం గా నవ్వుల్లో ముంచెత్తు తాయి ...

ప్రతి క్యారెక్టర్  మంచి ఎక్ష్ ప్రెషన్  తో చెప్పే మాటలు చాలా బాగుంటాయి ...నవ్విస్తాయి ....ఇది కుడా దర్శకుడే  రాయడం  అతని ప్రతిభ కు మరో కోణం చూపించినట్లు అయ్యింది త్రివిక్రమ్ వచ్చాక అందరు అతన్నే (ప్రాస తో)  ఫాలో అవుతున్నారు .. అయితే ముగ్గురు వ్యక్తులు  ఈ కోవ లోంచి తప్పించుకున్నారు ...ఒకడు పూరి జగన్నాథ్ ..రెండు శేఖర్ కమ్ముల ..మూడు ఇంద్రగంటి మోహన కృష్ణ ...

No confusion –Great Combination …

Asset -3 :

స్క్రీన్ మీద  చిన్న చిన్న విజువల్ ఎఫెక్ట్ లు చాలా బాగా  వాడుకున్నాడు ..ఇంద్రగంటి ...

1.టైటిల్స్ వేయడం

2.లావణ్య క్యారెక్టర్ Establishment  దగ్గర 

3.ఆనంద్ -నాని స్నేహం  బలపడుతుంది అని  ..Sunday ..Monday ….అని వచ్చేల చేయడం 

4.నాని --వరలక్ష్మి కి ఏమి పేరు చెప్పాలా ? అని ఆలోచిస్తుంటే ...అన్ని రకాలపేర్లు స్క్రీన్ మీద రావడం 

5.తనికెళ్ళ భరణి కల --రాముని గెట్ అప్ లో బాణం తో 

ఇలా చిన్న సినిమా కి మంచి attractions లు పెట్టారు ..

Asset -4:



అవసరాల శ్రీనివాస్ ..ఆనంద్ క్యారెక్టర్ …ఇతను కామెడి బాగా చేసాడు ...నాని ..కలర్స్ స్వాతి ...మంచి జంట గా యూత్ కి దగ్గరయ్యేలా  నటించారు ...సపోర్టింగ్  క్యారెక్టర్ లయిన తనికెళ్ళ భరణి ,అమ్మాజీ , ఝాన్సీ  అందరు బాగా చేసారు ...కంప్లీట్ ఫ్యామిలీ సినిమా ...

 Creative clue :


"గుడ్డి " అని  ఒక హిందీ సినిమా వుంది ...సినిమా వాళ్ళ మీద పిచ్చి వున్నా అమ్మాయి కధ అది ...హ్రిషికేశ్ ముఖర్జీ దాని దర్శకుడు ...అది మొత్తం సినిమా వాళ్ళ మీదే  కధ తిరుగుతుంది ...మెయిన్ పాయింట్ మాత్రం  బాగుటుంది ...

హిందీ సినిమాల్లో చాలా పస వుంటుంది ..ఎందుకంటే దేశం మొత్తానికి నచ్చేలా పాయింట్  లు వుంటాయి ... 

ఒక్క  "బాబి " "షోలే ".."డి -డి -ఎల్ "."దిల్ చాహతా హై "
ఇలాంటి సినిమా క్లాస్సిక్స్  నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి ..వస్తున్నాయి ..వస్తాయి ...


0 comments:

Post a Comment