Artical3



సినిమా కధ ఫాస్ట్ గా రాయాలంటే ?

1.స్టొరీ లైన్ :

ఇది  కచ్చితం గా ,క్లారిటీ గా రాసుకోవాలి ..దీని మీద కధ నడిచేలా ప్లాన్ చేసుకోవాలి ..ఇది సరిగ్గా వుంటే ,కొత్తగా వుంటే  సినిమా హిట్  కి ఛాన్స్  ఎక్కువ ...
తర్వాత స్టొరీ లైన్  కి తగిన విధం గా క్యారెక్టర్ లు రాసుకోవాలి ..

2.క్యారెక్టర్ లు :

 మెయిన్ క్యారెక్టర్ (హీరో )..తనకి ఎదురునిలిచే క్యారెక్టర్ లు వుండాలి ..అది విలన్ కావొచ్చు ..ఫాదర్ కావొచ్చు ..కధ ని బట్టి వుహించాలి ..
జెంటిల్ మాన్ ,అతడు ,కిక్ --లో  హీరో కి  ఎదురునిలిచేవి పోలీస్ క్యారెక్టర్ లు ..విలన్ లు వేరు ..బొమ్మరిల్లు లో హీరో కి ఎదురునిలిచేది ఫాదర్ క్యారెక్టర్ ..
స్ట్రాంగ్ క్యారెక్టర్ లు లేకపోవడం వలనే సినిమా లు ఆడటం లేదు ..అవి వుంటే కధని పరుగులు పెట్టించవచ్చు ..

3. హీరో క్యారెక్టర్  :

 హీరో క్యారెక్టర్  కి ఇబ్బందులు ఎదురవ్వాలి ...సమస్యలు వుండాలి ..అవి లేక పోవడం వలన సినిమా తేలిపోతుంది .. ఇబ్బ్బందుల్లో నుండి హీరో ఎలా బయట పడతాడు ? అనే విధం గా టెన్షన్ బిల్డ్ అప్ చేయాలి ...

సినిమా స్టొరీ లో హీరోయిన్ దగ్గర హీరో ఇబ్బంది కామెడీ ,లవ్ ఫీల్ ని  తెస్తుంది ..
సినిమా స్టొరీ లో విలన్ దగ్గర  హీరో ఇబ్బంది ఆక్షన్ ని తెస్తుంది .

4. సబ్ ప్లాట్ : ప్రేమ కధ
 
హీరో -హీరోయిన్ మద్య విభిన్నం గా  జరిగే ప్రేమకధ వుండాలి.ఇది చాలా చాలా బాగుండాలి ..కొత్తగా  వుండాలి ..ఇది బాగుంటే సినిమా సగం హిట్ ..అయితే ప్రతి కధలో ఇది సాధ్యపడక పోవచ్చు .

"గజినీ " లో సబ్ ప్లాట్   ప్రేమకధ -ఇద్దరు ప్రేమికుల మద్య బాగా జరుగుతుంది .
అలాగే "రోజా " లో  సబ్ ప్లాట్ ఏమిటి ? భార్య -భర్త మద్య ప్రేమ  జరుగుతుంది ..ఇలా కధ ని బట్టి సబ్ ప్లాట్ రాసుకోగాలగాలి ..

5.  స్టార్టింగ్ ,మిడ్ ,ఎండింగ్ పాయింట్ లు

స్టొరీ కి 
1) స్టార్టింగ్ ,
2)
మిడ్ ,
3)
ఎండింగ్ పాయింట్ లు తెలుసుకోవాలి .
ముఖ్యం
గా ఎండ్ పాయింట్  తెలిస్తే సినిమా కధ రాయడం ఈజీ అంటారు యండమూరి గారు .ఎందుకంటే కధ ఎండ్ పాయింట్ చేరడానికి ..ఎక్కడ స్టార్ట్ చేయాలి ..ఎక్కడ మిడ్ పాయింట్ ఇవ్వాలి ...వేగం పెంచుకుంటూ  ప్రీ క్లైమాక్స్  దాటి ..క్లైమాక్స్  కి రావాలి అనేది బాగా ఆలోచించవచ్చు .."గమ్యం " తెల్సిన ప్రయాణం సులువు ..ప్రయాణం చేస్తూ గమ్యం తెల్సుకోవడం కష్టం కదా ...

6. స్టొరీ స్ట్రక్చర్ :

 సెటప్ : క్యారెక్టర్ లను  పరిచయం
ప్లాట్ పాయింట్  : కధ కి మొదటి మలుపు
ప్లాట్ పాయింట్  : కధ కి ముగింపు కోసం వచ్చే మలుపు
ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్  అన్నీ ఒక పద్ధతి లో రాసుకోవాలి ... స్ట్రక్చర్ వస్తే చాలా వరకు కధ అయిపోయినట్టే ... తర్వాత   ముఖ్య మలుపులు సృష్టించాలి ...

Example :

బొమ్మరిల్లు సినిమా  స్ట్రక్చర్  చూద్దాం.

ప్లాట్ పాయింట్ 1 : జెనిలియా -సిద్దార్థ  గుడిలో పరిచయం
 
మిడ్ పాయింట్ : సిద్దార్థ ప్రేమ విషయం ప్రకాష్ రాజ్ కి తెలియడం
 
ప్లాట్ పాయింట్  2 : సిద్దార్థ  గురించి  ఇంట్లో వాళ్ళకి తెలియడం
 
ప్రీ క్లైమాక్స్  : జెనిలియా " వీడు నాకు వద్దు అంకుల్ " అని ఇంట్లోంచి వెళ్ళిపోవడం
 
క్లైమాక్స్ : సిద్దార్థ  -ప్రకాష్ రాజ్ దగ్గర " అంతా మీరే చేసారు " అని ఓపెన్ అవ్వడం ..

7. సినిమా లో ఫస్ట్ హాఫ్ కి  ,సెకండ్ హాఫ్ కి తేడా వుండాలి ..

Example :

బొమ్మరిల్లు లో ఫస్ట్ హాఫ్ లో ప్రేమ కధ బయట జరుగుతుంది .

సెకండ్ హాఫ్ లో ప్రేమ కధ ఇంట్లో ఫ్యామిలీ మద్య జరుగుతుంది .

8. సినిమా  కధ లో నమ్మించే ఇన్సిడెంట్స్  వుండాలి .వీటి వలనే సినిమా కధ కి డెప్త్  వస్తుంది .

Example :
 
ఒకే ఒక్కడు "లో ట్రాఫిక్ జామ్ సీన్ 
“ఒక్కడు” లో ఆక్షన్ బ్లాక్ సీన్

9. సినిమా కధ జరుగుతుంటే హీరో/హీరోయిన్  క్యారెక్టర్ గ్రాఫ్ పెరుగుతుందా ? లేదా ? చూసుకోవాలి ..హీరో/హీరోయిన్  మీద సానుభూతి వస్తుందా ? లేదా ? ..హీరో/హీరోయిన్  గెలుస్తుందా? లేదా ? అనే టెన్షన్  ప్లే అవ్వాలి ( ఇది కమర్షియల్  చినం కధలకు ..ఫీల్ గుడ్ కధలకు కాదు )

Example :

అరుంధతి ...ఒక్కడు ..ఆర్య ..

10. సినిమా కధ కి 60-70  సీన్ లు రాసుకోగలగాలి.ఆ సీన్ లలో కొత్తవి 8-10 వున్నా చాలు హిట్ ..

Example :

గబ్బర్ సింగ్ : కబడ్డీ సీన్ ,అంత్యాక్షరి సీన్ ,బ్రహ్మానందం కటౌట్ సీన్ ,పవన్ పెళ్లి మేళం సీన్ ..
11. ప్రతి సీన్ లో ప్రేక్షకుడి కి ఫీల్ ఎలా అవుతుందో ఆలోచించాలి (ఇది ఎవరూ ఆలోచించడం లేదు )..అలా అలోచించి ఫీల్ క్యారీ సీన్ లు రాసుకోవాలి .. 

Example :

రాజమౌళి సినిమాలు ,శేఖర్ కమ్ముల సినిమాలు 
12. స్క్రీన్ ప్లే మాత్రం ఎవరికీ వారు అలోచించాల్సిందే ...దాన్ని " ఇలా చెయ్యండి " అని ఎవరూ చెప్పలేరు ..మీ మైండ్ , మీ ఫ్రెండ్స్ మైండ్ ,మీకు సింక్ అయ్యేవాళ్ళ మైండ్ ,మీ ఇంగ్లీష్ సినిమా ల మైండ్ ..అన్నీ వర్క్ అవుట్ చెయ్యాలి ..సినిమా సినిమా కి స్క్రీన్ ప్లే మారుతుంది .

Example :

౩ ఇడియట్స్  స్క్రీన్ ప్లే వేరు
బొమ్మరిల్లు స్క్రీన్ ప్లే  వేరు
ఖుషి  స్క్రీన్ ప్లే వేరు
గజని  స్క్రీన్ ప్లే వేరు ..

13. కధ + స్క్రీన్ ప్లే +  మాటలు =  స్క్రిప్ట్ 

కధ =60-70  సీన్ లు
స్క్రీన్ ప్లే = ఎ సీన్ తర్వాత ఎ సీన్ 

మాటలు = ప్రతి సీన్ కి సరి అయిన మాటలు 

ఏవిధం గా నటిస్తూ చెప్పాలో ,ఎక్కడ చెప్పాలో  ..ఎలా చెప్పాలో  కూడా  రాసి వుండాలి… అదే స్క్రిప్ట్ అంటే ..

ఇందులో కెమెరా మూవ్మెంట్ ,షాట్ డివిజన్  కుడా తెల్సిన వారు మేధావులు

Example :

“ప్రస్థానం “ స్క్రిప్ట్
 
 
“ఓయ్”  స్క్రిప్ట్ ..“వినాయకుడుస్క్రిప్ట్..


ఈ సైట్ లో దొరుకుతాయి చూడండి..

14. స్క్రిప్ట్ కి మాటలు :సినిమా చూసే టప్పుడు ,చూసి బయటకు వచ్చాక  మాటలు గుర్తుండాలి ..వెంటాడాలి..గుర్తుకుతెచ్చుకుని  నవ్వు కోవాలి ..మన జీవితం లో మాట్లాడినట్టు పూర్తిగా ఉండకూడదు ..కాస్త డ్రమాటిక్ గా ...క్యూట్ గా ..కామెడీ గా సీన్ కి తగ్గట్టు రాయగలగాలి ..ఇంకొకరిని అనుకరించకూడదు..

15. స్క్రిప్ట్ మొదటి వెర్షన్ రాసాక  డౌట్స్  వుంటే  ప్రేక్షకుడి పాయింట్ అఫ్ వ్యూ లో అలోచించి సరి చేసుకోవాలి ..వెర్షన్ లు మారుతున్నా కొద్దీ  స్క్రిప్ట్ క్రిస్పీ గా ,టైట్  గా వుంటుంది ..అవసరం వుందా ? లేదా ? అని ఆలోచిస్తూ వెళ్ళండి ..

0 comments:

Post a Comment